ఈ నెల 31న విజయనగరం జిల్లా సాలూరులో గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ పర్యటించనున్నారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా చేపడుతున్న గర్భిణీల వసతిగృహం గిరి శిఖరాన్ని సందర్శిస్తారు. తర్వాత అరటి, మొక్కజొన్న రైతులతో ముచ్చటిస్తారు. పాచిపెంట మండలం కోనవలసలో ఉన్న గురుకుల పాఠశాల విద్యార్థులతోనూ మాట్లాడతారు. ఈ పర్యటన ఏర్పాట్లను ఐటీడీఏ పీవో అంబేడ్కర్, ఎమ్మెల్యే రాజన్న దొర పరిశీలించారు. రెవెన్యూ, వైద్య, పంచాయతీ రాజ్, మండల అధికారులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు.
ఈ నెల 31న విజయనగరంలో గవర్నర్ పర్యటన - ap governor will come to vijayanagaram on 31st of october
ఐటీడీఏ ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా చేపడుతున్న కార్యక్రమాలు సందర్శించేందుకు...ఈ నెల 31న విజయనగరం జిల్లా సాలూరులో గవర్నర్ పర్యటిస్తారు. ఈ ఏర్పాట్లను ఐటీడీఏ పీవో అంబేడ్కర్, ఎమ్మెల్యే రాజన్నదొర పర్యవేక్షించారు.
ఈ నెల 31న విజయనగరంలో గవర్నర్ పర్యటన