వేడి నుంచి రక్షణ కల్పించేందుకు గానూ... విజయనగరం జిల్లా పోలీసుశాఖలోని జాగిలాలకు నాలుగు ఎయిర్ కూలర్లను కొనుగోలు చేసినట్లు విజయనగరం జిల్లా ఎస్పీ బి. రాజకుమారి తెలిపారు. ఈ మేరకు కూలర్లను జిల్లా ఎస్పీ చేతులమీదుగా డాగ్ స్క్వాడ్ సిబ్బందికి జిల్లా పోలీస్ కార్యాలయంలో అందజేశారు. నేరస్థలం నుంచి పరారైన నిందితులను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్న పోలీస్ జాగిలాల ఆరోగ్యరీత్యా ఎయిర్ కూలర్లు సమకూర్చినట్లు ఎస్పీ రాజకుమారి వెల్లడించారు.
వేడి నుంచి ఉపశమనం.. పోలీస్ జాగిలాలకు ఎయిర్ కూలర్లు - vizianagaram-district latest news
విజయనగరం జిల్లా పోలీసుశాఖలో పోలీస్ జాగిలాలకు ఎండవేడిమి నుంచి చల్లదనాన్ని కల్పించేందుకు ఎయిర్ కూలర్లు సమకూర్చారు. జాగిలాల ఆరోగ్యరీత్యా ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రాజకుమారి వెల్లడించారు.
పోలీస్ జాగిలాలకు ఎయిర్ కూలర్లు ఏర్పాటు