అనకాపల్లి, విశాఖ లోక్సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన నేతలు పాలనాధికారికి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ... సుమారు 3 వేల 100పైగా పోస్టల్ బ్యాలెట్లు ఇంకా అందాల్సి ఉందని పాలనాధికారే ఒప్పుకున్నారంటే... పోస్టల్ బ్యాలెట్ పంపిణీలో లోపాలు ఉన్నాయని అర్థమవుతోందన్నారు. ఉద్యోగులు ఫారం-12 సరిగ్గా నింపలేదని... అందుకే పోస్టల్ బ్యాలెట్లు అందజేయలేక పోయామని ఉద్యోగులపై నెపం నెట్టడం సబబు కాదన్నారు. పాలనాధికారి ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వైకాపా నేతలు ఆరోపించారు.
పోస్టల్ బ్యాలెట్ పంపిణీలో లోపాలున్నాయి: వైకాపా
పోస్టల్ బ్యాలెట్ల విషయంలో లోపాలున్నాయని, ఉద్యోగులు సక్రమంగా ఓటు హక్కు వినియోగించుకునేలా అవకాశం కల్పించాలని వైకాపా అభ్యర్థులు జిల్లా పాలనాధికారిని కోరారు.
మళ్ల విజయప్రసాద్