విశాఖలో మోడ్రన్ ట్రామ్ కారిడార్ల కోసం... సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపకల్పనకు ప్రణాళికలు సిద్దం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం 60.2 కిలోమీటర్ల ట్రామ్ కారిడార్ ఏర్పాటుపై డీపీఆర్ రూపకల్పన కోసం డీఎమ్మార్సీ, రైట్స్, యుఎంటీసీ నుంచి కొటేషన్లు ఆహ్వానిస్తూ జీవో జారీ చేసింది. మెట్రో రైలుకు కిలో మీటరుకు రూ. 200 కోట్లు ధర నిర్ణయించగా.. ట్రామ్ కారిడార్ ఏర్పాటుకు కిలో మీటరుకు 100 - 120 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. స్టీల్ ప్లాంట్ నుంచి భోగాపురం ఎయిర్ పోర్టు వరకు ట్రామ్ కారిడార్ ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది.
విశాఖలో ట్రామ్ కారిడార్ల ఏర్పాటు దిశగా సర్కారు అడుగులు
విశాఖలో మెట్రోతో పాటు 60 కిలోమీటర్ల మేర ట్రామ్ కారిడార్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా ట్రామ్ కారిడార్ ఏర్పాటుపై డీపీఆర్ రూపకల్పన కోసం కొటేషన్లు ఆహ్వానిస్తూ జీవో జారీ చేసింది.
tram corridor in vishaka