విశాఖపట్నంలో మద్యం దుకాణాలు తెరవద్దంటూ మహిళలు ఆందోళన చేపట్టారు. ఆరిలోవలోని తోటగరువు ప్రాంతంలో ఉన్న మందు షాపుల వద్దకు పెద్దసంఖ్యలో చేరుకుని ధర్నాకు దిగారు.
మద్యం లేక 40 రోజులపాటు ప్రశాంతంగా ఉన్నామని.. ఇప్పుడు ప్రభుత్వం వాటిని తెరవటంతో గొడవలు, ఇబ్బందులు మొదలయ్యాయని వాపోయారు. వెంటనే రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు మూసివేయాలని డిమాండ్ చేశారు.