ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ROAD ACCIDENT: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి.. భర్తను కాపాడిన శిరస్త్రాణం - ap latest crime news

ROAD ACCIDENT: విశాఖ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. రహదారిపై భారీ గోతులు ఉండడం వల్లనే ఈ ఘటన చోటుచేసుకుందని భావిస్తున్నారు. దీనిపై ట్రాఫిక్​ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

WOMEN DIED IN ROAD ACCIDENT at anakapalli
WOMEN DIED IN ROAD ACCIDENT at anakapalli

By

Published : Dec 9, 2021, 2:09 AM IST


WOMEN DIED IN ROAD ACCIDENT: విశాఖ జిల్లా అనకాపల్లి సుంకరమెట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. వడ్డాది గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాల విద్యా కమిటీ ఛైర్మన్ తెప్పల సంతోషి (40).. భర్త నాగేశ్వర రావుతో కలిసి ద్విచక్ర వాహనంపై గంగవరం ప్రయాణిస్తున్నారు. ప్రయాణ సమయంలో అనకాపల్లి సుంకరమెట్ట వద్ద వారి వాహనం అదుపుతప్పడంతో కిందపడ్డారు.

ఈ ప్రమాదంలో సంతోషి తలకి బలమైన గాయం అయింది. దీంతో ఆమె ఘటనాస్థలిలోనే మృతి చెందింది. భర్త నాగేశ్వరరావు శిరస్త్రాణం ధరించడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. రహదారిపై భారీ గోతులు ఉండటంతో ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. కళ్ల ముందే భార్య మృతి చెందడంతో.. భర్త నాగేశ్వర రావు కన్నీరుమున్నీరయ్యాడు. దీనిపై అనకాపల్లి ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details