అరకులో ముగ్గురు చిన్నారులు సహా తల్లి ఆత్మహత్య - అరకు వార్తలు
22:58 July 16
పిల్లలకు పురుగుమందు తాగించి ఉరేసుకున్న తల్లి
విశాఖ జిల్లా అరకులోయలో శుక్రవారం రాత్రి విషాదకర ఘటన జరిగింది. ఓ తల్లి పిల్లలకు పురుగుల మందు తాగించి తానూ ఆత్మహత్యకు పాల్పడింది.
సిమిలిగుడ గ్రామానికి చెందిన సంజీవ్ అనే వ్యక్తి జీసీసీలో ఒప్పంద సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. తన భార్య సురేఖతో పాటు ముగ్గురు పిల్లలతో అరకులోయలో నివాసం ఉంటున్నాడు. కొద్ది రోజులుగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. పిల్లలకు పురుగుల మందు తాగించిన సురేఖ.. ఆ తర్వాత తనూ ఆత్మహత్యకు పాల్పడింది. ముగ్గురు పిల్లలు గదిలోనే విగతజీవులుగా పడి ఉన్నారు. వారిని శవ పంచనామ కోసం అరకు లోయ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. సురేఖను తన భర్త సంజీవ్ హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి తండ్రి, బంధువులు ఆరోపిస్తున్నారు. అరకులోయ ఎస్సై షేక్ నజీర్ విచారణ చేస్తున్నారు. వైద్య కేంద్రం వద్ద ఉద్రిక్త వాతవరణం చోటుచేసుకుంది.
ఇదీ చదవండి:SUPARI KILLING: హంతకులను పట్టించిన మొబైల్ సిగ్నల్స్