మహిళా సాధికారికత, యువతలో విలువల స్థాపన వంటి సామాజిక అంశాలపై విశాలాంధ్ర సంపాదకుడు, దివంగత ముత్యాల ప్రసాద్ విస్తృత పత్రికా రచన చేశారని సెంచూరియన్ విశ్వవిద్యాలయం ఉపకులపతి జీఎస్ఎన్ రాజు అన్నారు. విశాఖ పౌర గ్రంథాలయంలో నిర్వహించిన ముత్యాల ప్రసాద్ సంస్మరణ సమావేశంలో పాల్గొని... ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. యువతను విలువలతో కూడిన పాత్రికేయులుగా రూపొందించేందుకు ముత్యాల ప్రసాద్ గణనీయమైన కృషి చేశారని అన్నారు. అవిశ్రాంత కృషికి నిలువెత్తు సాక్ష్యంగా ఆయన నిలుస్తారని అన్నారు. మానవీయ విలువలు తిరోగమన దిశలో ఉన్న ప్రస్తుత దశలో... ప్రజాతంత్ర గళాన్ని వినిపించిన మహోన్నత వ్యక్తి అని రాజు అభివర్ణించారు.
అవిశ్రాంత కృషికి నిలువెత్తు నిదర్శనం సంపాదకుడు ముత్యాల ప్రసాద్
విశాలాంధ్ర సంపాదకుడు.. దివంగత ముత్యాల ప్రసాద్ సంతాప సభ... విశాఖ జిల్లాలోని పౌర గ్రంథాలయంలో జరిగింది. యువతను విలువలతో కూడిన పాత్రికేయులుగా రూపొందించేందుకు ముత్యాల ప్రసాద్ గణనీయమైన కృషి చేశారని... సెంచూరియన్ విశ్వవిద్యాలయం ఉపకులపతి జీఎస్ఎన్ రాజు అన్నారు.
విశాఖలో సంపాదకుడు దివంగత ముత్యాల ప్రసాద్ సంతాప సభ