ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉద్యోగాల పేరుతో మోసం..పోలీసుల అదుపులో ముఠా

ఉద్యోగాల పేరుతో యువత నుంచి దరఖాస్తులు సేకరిస్తారు. నకిలీ నియామక పత్రాలు పంపి తమ ఖాతాల్లో నగదు జమ చేయించుకుంటారు. ఇలా ఎంతోమందిని మోసం చేస్తున్న వారిని విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు.

సైబర్ మోసగాళ్లు

By

Published : Oct 4, 2019, 8:00 PM IST

నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులు

ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను మోసం చేస్తున్న నేరగాళ్లను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. దిల్లీలోని ఘజియాబాద్​ కేంద్రంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న వీరి గుట్టు రట్టు చేశారు. షైన్ డాట్ కామ్ పేరిట నిరుద్యోగుల నుంచి ఆన్​లైన్​లో దరఖాస్తులు స్వీకరించి పెద్దమొత్తంలో వారి నుంచి వేర్వేరు ఖాతాల్లోకి నగదు డిపాజిట్ చేయించుకోవడమే వీరి పని. విశాఖకు చెందిన గండ్రెడ్డి విజయ్ గోపాల్ వీరి బాధితుల్లో ఒకరు. నకిలీ ఉద్యోగ నియామక పత్రాలను గోపాల్​కు పంపి ఐదు లక్షల 89 వేల రూపాయలను అతని ద్వారా వేర్వేరు ఖాతాలలో సైబర్ నేరగాళ్లు జమ చేయించుకున్నారు. ఇతని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన విశాఖ సైబర్ క్రైం పోలీసు బృందం దిల్లీకి వెళ్లి ఆరా తీసింది. ఘజియాబాద్​లోని మాల్ వైశాలిలో కాల్ సెంటర్ నడుపుతున్న నేరగాళ్లను పోలీసులు గుర్తించారు. ఈ కాల్ సెంటర్​పై దాడి చేసి నితిన్ గుప్తా, రాహుల్, మోనుగోపాల్ అనే నిందితులను అరెస్ట్ చేశారు. మూడు లాప్​ట్యాప్​లు, మూడు మొబైల్ ఫోన్లు, ఒక రోటర్​ను స్వాధీనం చేసుకున్నారు. విశాఖ సైబర్ క్రైం ఇన్​స్పెక్టర్ గోపీనాథ్ నేతృత్వంలో ఆరుగురు పోలీసుల బృందం నిందితులను పట్టుకుంది.

ABOUT THE AUTHOR

...view details