గిరిజన ప్రాంతాల్లో ఆధార్ సెంటర్లు అందుబాటులో లేకపోవడంతో గిరిజనులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.విశాఖ ఏజెన్సీ11మండలాల్లో గిరిజనులే ఎక్కువగా ఉన్నారు.చాలామంది మండల కేంద్రాలకు దూరంగా దూరంగా నివసిస్తుండటంతో,ఆధార్ సెంటర్ చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ముఖ్యంగా అమ్మఒడి కోసం చిన్న పిల్లలు,పింఛన్ల కోసం వృద్దులు వ్యయ ప్రయాస పడి ఆధార్ కేంద్రాలకు చేరుకుంటున్నారు.భారీగా తరలివస్తున్న జనాలతో బ్యాంక్ లు,పోస్ట్ ఆఫీస్ లో అప్ డేట్ చేసేందుకు తేదీలను ఇస్తున్నారు అధికార్లు.ఒక్కొక్కరికి రెండు నెలల వరకు సమయం ఇస్తుండటంతో గిరిజనలు గగ్గోలు పెడుతున్నారు.అప్ డెట్ చేసుకోవాడనికి రెండు నెలలు పడితే,పథకాల లబ్ది పొందడానికి అంతవరకు వేచి ఉండాలా అని ప్రశ్నిస్తున్నారు.గతంలో మాదిరి పంచాయితీ కార్యాలయాల్లోనే ఆధార్,బ్యాంక్,పోస్ట్ ఆఫీస్ ల ఈకేవైసీ అనుసంధానం చేపట్టాలని కోరుతున్నారు.
మన్యానికి ఈకేవైసీ తిప్పలు తప్పవా..? - visakhapatnam district
సాంకేతికత తెలియని విశాఖ మన్యం గిరిపుత్రులు ఆధార్ ఈకేవైసీ చేసుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. వేలిముద్రలు అనుసంధానం కోసం రోజుల తరబడి పిల్లల్ని వెంటేసుకుని మన్యం మండల కేంద్రాలు తిరుగుతూ అగచాట్లు పడుతున్నారు.
మన్యానికి ఈకేవైసీ తిప్పలు తప్పవా..?