ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 5, 2021, 11:48 PM IST

ETV Bharat / state

ఉపాధ్యాయుల కోసం పంచాయతీ ఎన్నికలు బహిష్కరించిన గ్రామస్థులు

పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించి పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఓ గ్రామం ఎన్నికలను బహిష్కరించింది. దీంతో దిగొచ్చిన అధికారులు ఆ గ్రామానికి ముగ్గురు ఉపాధ్యాయులను నియమిస్తామని హామీ ఇచ్చారు. అధికారుల హామితో గ్రామస్తులు ఎన్నికల నిర్వహణకు ఒప్పుకున్నారు.

villagers boycott elections for the school teachers
ఉపాధ్యాయులు కావాలని ఎన్నికలను బహిష్కరించిన గ్రామస్థులు

విశాఖ ఏజెన్సీ గూడెం కొత్త‌వీధి మండలం దారకొండ ప్ర‌భుత్వ ప్రాధ‌మికోన్న‌త పాఠ‌శాల‌లో ఉపాధ్యాయులను నియమించకుంటే స్థానిక పంచాయితీ ఎన్నికలను బహిష్కరిస్తామని స్థానికులు అధికారులను హెచ్చరించారు. స్పందిచిన పోలీసులు...చింతపల్లి ఏఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశంతో సీఐ కె. మురళీధర్ పాఠశాలను సందర్శించి స్థానికులతో మాట్లాడారు.

ఉపాధ్యాయుల స‌మ‌స్య‌పై ఇప్ప‌టికే ఏఎస్పీ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారితో మాట్లాడార‌ని ముగ్గురు ఉపాద్యాయుల‌ను నియ‌మించ‌డానికి చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ని ఆయ‌న గ్రామస్థులకు తెలిపారు. ప్ర‌జ‌లు స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంలో పోలీసుశాఖ ఎప్పుడు ముందుంటుంద‌న్నారు. ఎన్నిక‌లు బ‌హిష్క‌రించే ఆలోచ‌న విర‌మించుకోవాల‌ని గ్రామస్తులను కోరారు. పోలీసుల హామీతో గ్రామస్తలు ఎన్నికల నిర్వహణకు ఒప్పుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details