ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పర్వతారోహణలో ఔరా..! అనిపిస్తున్న యువతీయువకులు - తారుమారు సంతలో వింత ఆచారాలు

కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే నానుడిని విశాఖ నెహ్రూ యువ కేంద్రం యువత నిజం చేస్తున్నారు. ధైర్య సాహసాలతో ముందుకెళితే...ప్రతి ఒక్కరూ ఆశించిన ఫలితాలు సాధించవచ్చని నిరూపిస్తున్నారు. ఎత్తైన పర్వతాలను సైతం తాళ్లతో ఎక్కుతూ ఔరా ! అనిపిస్తున్నారు.

పర్వతారోహణలో ఔరా..! అనిపిస్తున్న యువతీయువకులు
పర్వతారోహణలో ఔరా..! అనిపిస్తున్న యువతీయువకులు

By

Published : Dec 11, 2019, 6:52 AM IST

నెహ్రు యువజన కేంద్రం నుంచి విశాఖపట్నం, విజయనగరం , శ్రీకాకుళం నుంచి 25 మంది యువతీ, యువకులు పర్వతారోహణలో ధైర్యసాహసాలు ప్రదర్శిస్తున్నారు. బృందంలో ఉన్న పది మంది యువతులు మేము సైతం అంటూ కొండలు ఎక్కి దిగే ప్రయత్నం చేస్తున్నారు. సాహసమే మా ఊపిరి అంటూ తాళ్లతో కొండలు దిగుతున్నారు. వీరికి నెహ్రు యువజన కేంద్రం శిక్షకులు ప్రత్యేక తర్ఫీదునిస్తున్నారు.

పర్వతారోహణలో ఔరా..! అనిపిస్తున్న యువతీయువకులు
విశాఖ మన్యం పాడేరు అరకు లోయ మధ్యలో రంగశీల వద్ద ఎత్తయిన కొండల్లో పర్వతారోహణ చేస్తున్నారు. భూమికి 1000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ కొండలను అలవోకగా ఎక్కుతున్నారు. 200 అడుగుల ఎత్తయిన కొండను ఎంచుకొని పై నుంచి తాళ్ల సాయంతో పర్వతారోహణ చేస్తున్నారు. యువత తలచుకుంటే సాధించలేనిది ఏమీ ఉండదు అని నిరూపిస్తున్నారు ఈ యువత. ప్రకృతి రమణీయత, సౌందర్యం కలబోసుకుని ఆహ్లాదాన్ని పంచె మన్యం కొండ కోనల్ని ఎంచుకుని పర్వతారోహణ చేస్తున్నారు. యువతులు ఎత్తైన కొండ నుంచి తాళ్ల సాయంతో దిగుతుంటే తోటి స్నేహితులు వారిని ప్రోత్సహించి వారిలో ధైర్యం నింపుతున్నారు. పర్వతారోహణ ద్వారా యువతలో దైర్యసాహసాలు పెంపొందుతాయని వారు చెబుతున్నారు.

ఎవరో చేసిన సాహసం తాము చెప్పుకోవడం కాదు మేము కూడా సాహసం చేసి నలుగురు... తమ గురించి గొప్పగా చెప్పుకునేలా...చేస్తామంటూ పర్వతారోహణలో దూసుకెళ్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details