ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనారోగ్యానికి గురైతే..అంబులెన్స్​ బదులు డోలి ఎక్కాల్సిందే - విశాఖలో డోలి కష్టాలు న్యూస్

విశాఖ ఏజెన్సీలో డోలి కష్టాలు అన్నీ ఇన్నీ కావు.. ఊరు దాటాలంటే అంతే సంగతులు. అనారోగ్య సమస్య వస్తే.. అంబులెన్స్​కు బదులు డోలి ఎక్కాల్సిందే. నానా కష్టాలు పడుతూ.. రహదారిపైకి వస్తేనే వారికి వైద్యం అందేది.

transportation problems in vishaka agency
transportation problems in vishaka agency

By

Published : Jul 21, 2020, 3:45 PM IST

అక్కడ అనారోగ్యమైతే.. అంబులెన్స్​కు బదులు డోలి ఎక్కాల్సిందే

విశాఖ ఏజెన్సీలో డోలి కష్టాలు ఇంకా తీరడం లేదు. రోగులను ఆసుపత్రులకు తరలించేందుకు నానా ఇక్కట్లు పడుతున్నారు గిరిజనులు. హుకుంపేట మండలం శోభకోట పంచాయతీ కంగదువలో ఓ యువకుడు అనారోగ్యం బారిన పడ్డాడు. లేవలేని పరిస్థితిలో ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. అంబులెన్స్​కు ఫోన్ చేస్తే.. షరా మామూలే.. వచ్చేందుకు కదరదు. రహదారికి తీసుకురండంటూ సమాధానం. యువకుడిని డోలిపైకి ఎక్కించి.. మూడు కిలోమీటర్ల మేర కొండ కోనల నుంచి మోసుకొచ్చి అవస్థలు పడ్డారు. అనంతరం అంబులెన్స్​లో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా గర్భిణులు, రోగులను ఇలాగే డోలిలో తీసుకెళ్లాల్సి వస్తుందని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details