'దాయాదిని దంచండి' - ఉగ్రవాదం
పుల్వామా వద్ద ఉగ్రదాడిని నిరసిస్తూ విశాఖలో బంగారం, వెండి వర్తకులు ర్యాలీ నిర్వహించారు. 'ఉగ్రవాదం నశించాలి, 370 ఆర్టికల్ రద్దు చేయాలి, అమరవీరులారా...మీ త్యాగాలను వృథా కానివ్వం' అంటూ నినదించారు.
పుల్వామా వద్ద ఉగ్రదాడిని నిరసిస్తూ విశాఖలో ర్యాలీ చేస్తున్న వర్తకులు
జమ్మూకశ్మీర్ పుల్వామాలో ఉగ్రదాడిని నిరసిస్తూ విశాఖలో బంగారం, వెండి వర్తకుల సంక్షేమ సంఘం ర్యాలీ చేసింది. టౌన్ కొత్త రోడ్డు నుంచి జగదాంబ జంక్షన్ వరకు వ్యాపారులు ప్రదర్శన చేశారు. "ఉగ్రవాదం నశించాలి, 370 ఆర్టికల్ రద్దు చేయాలి, అమరవీరులారా...మీ త్యాగాలను వృథా కానివ్వం" అంటూ నినదించారు. పాకిస్థాన్ పై ప్రతీకారం తీర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమర జవాన్ల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.