ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భక్తుల చెంతకే శ్రీవారి లడ్డు

లాక్​డౌన్​ కారణంగా తిరుమల తిరుపతి ఆలయం మూతపడింది. రెండు నెలలు పాటు తిరుమల తిరుపతి స్వామి దర్శనాలు లేవని బాధపడే భక్తులకు తితిదే అవకాశాన్ని కల్పించింది. విశాఖ ఎంవీపీ కాలనీలో ఉన్న తితిదే కల్యాణ మండపంలో భక్తులకు స్వామివారు లడ్డులు అందిస్తోంది.

tirumala tirupati devastanam
విశాఖ తితిదేలో స్వామివారి లడ్డు

By

Published : May 28, 2020, 2:11 PM IST

రెండు నెలల నుంచి శ్రీవారి ఆలయంలోకి భక్తులకు ప్రవేశం లేని కారణంగా... భక్తులంతా తల్లడిల్లిపోయారు. కలియుగ దైవంగా పూజలందుకొనే కోనేటి రాయుడి దర్శనం లేక బాధపడే భక్తులకు తితిదే అపురూపమైన అవకాశం కల్పిస్తోంది. సబ్సిడీ ధరకే తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి లడ్డు ప్రసాదాన్ని అందిస్తోంది.

విశాఖ తితిదే కల్యాణ మండపంలో శ్రీ వారి లడ్డు వితరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దీంతో భౌతిక దూరం పాటిస్తూ లడ్డులు అమ్మకం కొనసాగుతోంది. తిరుమల తిరుపతి వెళ్తే గాని దొరకని శ్రీవారి లడ్డును ఉత్తరాంధ్ర జిల్లాలకు అందించినందుకు తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు ధన్యవాదాలు చెప్తున్నారు.

లాక్ డౌన్ నియమాలు పాటిస్తూ, లడ్డు అమ్మకాలు చేయడం ఆనందంగా ఉందని భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి లడ్డు అమ్మకాలకు వస్తున్న ఆదరణతో గడువు మరింత పెంచడానికి తితిదే ఆలోచన చేస్తుంది. ప్రస్తుతం ఈ నెలాఖరు వరకు లడ్డు అమ్మకాలు కొనసాగుతాయని అధికారులు చెప్తున్నారు.

ఇవీ చూడండి:

'వీధి వ్యాపారులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలి'

ABOUT THE AUTHOR

...view details