ముగ్గురు దొంగల అరెస్టు.. బంగారం, వెండి స్వాధీనం - విశాఖలో వరుస చోరీలు
విశాఖ, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో చోరీలకు పాల్పడ్డ నిందితులను అనకాపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ఇప్పటివరకూ 45 ఇళ్లల్లో చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. వీరి నుంచి 2,700 గ్రాముల బంగారం, 7 కేజీల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. చోరీ కేసులో ప్రధాన నిందితుడు బోద్దపు బాబురావు హత్యకు గురయ్యాడు. ప్రధాన నిందితుడు హత్యకు గురవ్వటంతో పూర్తి స్థాయిలో సమాచారం రాబట్టలేకపోయామని అదనపు ఎస్పీ అచ్యుతరావు తెలిపారు. ఈ ఘటనపై ప్రత్యేక దృష్టి సారిస్తామని వివరించారు.