విశాఖ జిల్లా మాడుగుల మండలం ఎం. కోడూరులో అర్ధరాత్రి దొంగతనం జరిగింది. రాత్రి కరెంట్ పోవటంతో జనపరెడ్డి రాజారావు కుటుంబం డాబాపైకి వెళ్లి నిద్రపోయింది. ఆ సమయంలో దొంగలు ఇంటికి ఉన్న వెంటిలేటర్ తొలగించి లోపలకు ప్రవేశించారు. బీరువా పగులగొట్టి రెండున్నర తులాల బంగారు దోచుకెళ్లారు. ఉదయం చోరీ జరిగినట్లు గమనించిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉక్కని డాబాపైకి వెళ్తే దారుణం జరిగింది.... - మాడుగుల
వేసవి కాలం.. పైగా కరెంట్ లేదు.. ఉక్కపోత భరించలేక దాబాపైకి వెళ్లి పడుకున్నారు ఆ కుటుంబసభ్యులు. ఉదయం లేచి చూసేసరికి దొంగలు బంగారం దోచుకెళ్లిన ఘటన విశాఖ జిల్లా ఎం. కోడూరులో జరిగింది.
వెంటిలేటర్ తొలగించి.. బంగారం దోచుకెళ్లారు