ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 26, 2020, 11:47 PM IST

ETV Bharat / state

ఓ చిన్నారికి మరో చిన్నారి అమ్మ..!

చిన్నతనంలోనే అమ్మతనం. పిల్లల్ని లాలించి... ఆడించటంలో వారికి వారే సాటి. పుట్టినప్పటి నుంచి నడిచే వయసు వచ్చే వరకు శిశువును సాకుతూ వారికి ఆ చిన్నారులే అమ్మలవుతున్నారు. తల్లి పొలం పనులు చేస్తుంటే గొడుగు నీడలో నాలుగేళ్ళ చిన్నారి ఎనిమిది నెలల పసివాడిని సంరక్షించే అద్భుత దృశ్యం విశాఖ మన్యంలో కనిపించింది.

the-older-sisters-bond-in-the-form-of-a-mother
చిన్నారికి మరో చిన్నారి అమ్మ

చిన్నారికి మరో చిన్నారి అమ్మ

విశాఖ మన్యంలో పొలం పనులు చేసుకునే అమ్మలు... చంటి పిల్లల ఆలనా పాలనా బాధ్యతలు చిన్నారులకు అప్పగిస్తారు. దీంతో ఇంట్లో చిన్నారులు.. అమ్మ అవతారం ఎత్తి చంటి పిల్లల్ని ఆలనాపాలనా చూస్తారు. ప్రేమతో ఆ బిడ్డలను అక్కున చేర్చుకుంటారు. దీంతో పెద్దలకు వారి ఇంటి పనులు, పొలం పనులు, వంట పనులు చకచకా అయిపోతాయి. చిన్నారులు తమ ఒడిలో వేసుకుని లాలించి పాలించి పిల్లల్ని నిద్ర పుచ్చుతారు. అక్క బంధం అమ్మలుగా బాధ్యత పెనవేసుకుంటుంది. తల్లి పొలం పనులు చేస్తుంటే గొడుగు నీడలో నాలుగేళ్ళ చిన్నారి ఎనిమిది నెలల పసివాడిని సంరక్షించే ఈ దృశ్యం హుకుంపేట మండలం సంతారి సమీప పొలాల్లో దర్శనమిచ్చింది.

ABOUT THE AUTHOR

...view details