ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కేజీహెచ్​లో కలకలం... భవనంపై నుంచి పడి వృద్ధుడు మృతి

విశాఖజిల్లా కేజీహెచ్​ భవనంపై నుంచి పడి ఓ వృద్ధుడు మృతి చెందడం కలకలం రేపింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతి మృతి చెందడం బంధులు ఆందోళన చేపట్టారు. వైద్యుల నిర్లం కారణంగానే ఆమె మరణించిందని ఆరోపించారు.

old man died
వృద్ధుడు మృతి

By

Published : Oct 17, 2020, 8:59 AM IST

విశాఖ కేజీహెచ్​లో రెండు సంఘటనలు కలకలం రేపాయి. పైఅంతస్తు నుంచి పడి 60 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. స్థానికులు సమాచారం అందించటంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతి చెందిన వ్యక్తి శివాజీ పాలెం వాసి ఉప్పిలి రామారావుగా గుర్తించారు. పోర్ట్​ నుంచి ఇటీవలే ఉద్యోగవిరమణ పొందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆత్మహత్య చేసుకునేంత ఆర్థిక ఇబ్బందులు లేవని పేర్కొన్నారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి మరణించిన వ్యక్తి ప్రమాదవశాత్తు చనిపోయాడా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో విచారిస్తున్నారు. అనారోగ్య సమస్యలకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదన్నారు.

కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువతి మృతి:

కేజీహెచ్​లో చికిత్స పొందుతూ యువతి మరణించింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తమ కుమార్తె మృతి చెందిందని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. పోలీసులు వచ్చి గొడవ సద్దుమణిగేలా చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం.. తాటిచెట్లపాలెంలో నివాసముంటున్న గార పైడ్రాజు కుమార్తె వాసంతి (20) డిగ్రీ రెండో సంవత్సరం చదువుతుంది. ఈ నెల 15 సాయంత్రం 6 గంటల సమయంలో వాసంతికి ఫిట్స్ వచ్చింది. దీంతో తల్లిదండ్రులు స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షించి కేజీహెచ్ పంపించారు. చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తమ కుమార్తె చనిపోయిందని కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగారు.

"ఆసుపత్రిలో చేరే ముందే యువతి పరిస్థితి విషమంగా ఉంది. మెదడులో రక్తనాళాలు చిట్లి పోవడంతో మెరుగైన వైద్యం అందించినా ఫలితం లేకపోయింది. ఆమె ఆరోగ్యపరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆమె కుటుంబ సభ్యులు, బంధువులకు తెలియజేశాము. వారి ఆరోపణల్లో వాస్తవం లేదు" అని కేజీహెచ్ ఆర్ఎం అంజిబాబు తెలిపారు.

ఇదీ చదవండి: మొదట్లో అబ్బాయిలు సున్నితంగా ఉండి... తర్వాత ముసుగు తొలగిస్తారు

ABOUT THE AUTHOR

...view details