సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ విశాఖలో ఆందోళన చేపట్టింది. జీవీఎంసీ గాంధీ పార్క్లో ఉపాధ్యాయులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. సంవత్సరాల తరబడి పనిచేస్తున్న ఉపాధ్యాయులను బదిలీ చేయాల్సి ఉన్నప్పటికి..ఆ దిశగా నిర్ణయం తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఇప్పటికీ పీఎఫ్ ఖాతాలు ప్రారంభం కాకపోవడం శోచనీయమన్నారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని ఉపాధ్యాయులు హెచ్చరించారు.
విశాఖలో 'టీచర్స్ ఫెడరేషన్' ఆందోళన - విశాఖలో ఉపాధ్యాయుల ధర్నా
ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ విశాఖలో టీచర్స్ ఫెడరేషన్ ఆందోళన చేపట్టింది. ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు.
విశాఖలో టీచర్స్ ఫెడరేషన్ ఆందోళన..