కౌంటింగ్‌పై తెదేపా కసరత్తు... ఏజెంట్లకు శిక్షణ - తెదేపా
విశాఖపట్నంలో ఓట్ల లెక్కింపులో అనుక్షణం అప్రమత్తంగా ఉండేందుకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై విశాఖలో తెదేపా శిక్షణ కార్యక్రమం చేపట్టింది. విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు.. పార్టీ కార్యాలయంలో రోజుకు రెండు అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున శిక్షణ ఇచ్చారు.
మెుదటి రోజు ఉదయం విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గల ఎమ్మెల్యే అభ్యర్థులకు, చీఫ్ ఎలెక్షన్ ఏజెంట్లు, పోస్టల్ ఎలక్షన్ ఏజెంట్స్ మరియు లీగల్ అడ్వయిజర్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. మధ్యాహ్నం విశాఖ దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గం కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ జరుగుతున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎప్పుడు ఎలా వ్యవహరించాలి? పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఎలా ఉంటుంది? తదితర అంశాల గురించి వివరించారు.