మైనార్టీలు ఇప్పుడు గుర్తుకు వచ్చారా? - ముఖ్యమంత్రి ఎన్పీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ
ముఖ్యమంత్రికి ఇప్పుడు మైనార్టీలు గుర్తుకు వచ్చారా? అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ నజీర్ ధ్వజమెత్తారు. విశాఖ జిల్లాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం జగన్ను ఆయన విమర్శించారు. ఎన్పీఆర్కి వ్యతిరేకంగా 80 రోజులుగా నిరసనలు జరుగుతున్నా స్పందించిన ముఖ్యమంత్రి స్థానిక ఎన్నికలు వచ్చేసరికి ఎన్పీఆర్కు వ్యతిరేకంగా మాట్లాడారని అన్నారు. ఆందోళనలు చేస్తునన్నప్పుడు గుర్తుకు రాని మైనార్టీలు స్థానిక సంస్థ ఎన్నికలు రాగానే గుర్తుకు వచ్చారని ఎద్దేవా చేశారు.
మైనార్టీలు ఇప్పుడు గుర్తుకు వచ్చారా?