ఈ రోజు విశాఖలోని హరిత రిసార్ట్ వద్ద నిరసనకు తెదేపా పిలుపునిచ్చింది. ఉదయం పదిన్నర గంటలకు ఆందోళనలు చేపట్టనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలోో.. తెదేపా నేత వెలగపూడి రామకృష్ణను పోలీసులు గృహనిర్బంధం చేశారు. విశాఖ ఎంవీపీ కాలనీలోని వెలగపూడి ఇంటి వద్ద పోలీసుల మోహరించారు. ముందస్తు చర్యల్లో భాగంగా పలువురు తెదేపా నేతలను అరెస్టు చేశారు.
Haritha resort: నిరసనకు తెదేపా పిలుపు.. నేతల గృహనిర్బంధాలు.. - tdp on vishaka resort issue
నగరంలోని రుషికొండ వద్ద పర్యావరణానికి విఘాతం కలిగించేలా నిర్మాణాలు చేపడుతున్నారంటూ విశాఖ నగర తెదేపా నిరసనకు పిలుపునిచ్చింది. దీంతో తెదేపా శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టేందుకు సిద్ధమయ్యాయి. ముందస్తు చర్యల్లో భాగంగా పలువురు తెదేపా నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
tdp
హరిత రిసార్ట్ ప్రాంతంలో పర్యావరణానికి విఘాతం కలిగించేలా నిర్మాణాలు చేస్తున్నారని తెదేపా ఆరోపిస్తోంది. హరిత రిసార్ట్ ప్రాంతంలో నిర్మాణాలను వ్యతిరేకిస్తూ నిరసనకు తెదేపా పిలుపునిచ్చింది. ప్రభుత్వం ఇటీవల హరిత రిసార్ట్ కూలగొట్టి మరో నిర్మాణం చేపడుతోంది.
ఇదీ చదవండి: విద్యార్థుల అభ్యసనంపై కరోనా ప్రభావం... ఏకాగ్రతలో వెనకబాటు
Last Updated : Oct 27, 2021, 1:07 PM IST