విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయవద్దంటూ చేపట్టిన ఉద్యమానికి... ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు సంఘీభావం తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ.. ఎమ్మెల్యే వెలగపూడి పార్టీ కార్యాలం నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు అంటూ నినదిస్తూ.. జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మల్యే వెలగపూడితో, తెదేపా నేతలు పల్లా శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్లు, కార్పొరేటర్ అభ్యర్థులు, తెదేపా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే వెలగపూడి బైక్ ర్యాలీ - vizag steel plant recent news
విశాఖ తూర్పు నియోజకవర్గ తెదేపా నేతల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా ఎమ్మెల్యే వెలగపూడి పార్టీ ఆఫీసు నుంచి.. జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.
ఎమ్మెల్యే వెలగపూడి బైక్ ర్యాలీ