'వైకాపా ప్రభుత్వం పేదలకు అన్యాయం చేస్తోంది'
వైకాపా ప్రభుత్వం పింఛన్లు, రేషన్ కార్డులు రద్దు చేసి పేదలకు అన్యాయం చేస్తోందని.. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. విశాఖ జిల్లా రాయవరంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వం పేదల భూములు లాక్కొంటూ నిరంకుశ పాలన సాగిస్తోందని ధ్వజమెత్తారు. ఏళ్లుగా సాగులో ఉన్న భూములను బలవంతంగా స్వాధీనం చేసుకుంటున్నారని ఆరోపించారు. రైతులకు పరిహారం ఇవ్వకపోవడం దారుణమని మండిపడ్డారు.
వంగలపూడి అనిత