ఈనెల 4వ తేదీన తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం లేదని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఈ మేరకు అభిమానులు, కార్యకర్తలు వేడుకలు నిర్వహించవద్దని తెలిపారు.
నా పుట్టినరోజు వేడుకలు నిర్వహించొద్దు.. అభిమానులకు అయ్యన్న పిలుపు - మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు తాజా వార్తలు
ఈనెల 4వ తేదీన తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు తెదేపా నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. కార్యకర్తలు, అభిమానులు ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టవద్దని సూచించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఎవరూ శుభాకాంక్షలు తెలిపేందుకు ఇంటికి రావద్దని పేర్కొన్నారు.
tdp leader
అభిమానులు ఎవరూ బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న క్రమంలో శుభాకాంక్షలు తెలియజేయడానికి ఎవరూ రావద్దని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రతి ఏటా పుట్టినరోజు నాడు నిర్వహించే రక్తదాన శిబిరాన్ని ఈ ఏడాది రద్దు చేస్తున్నట్టు అయ్యన్నపాత్రుడు ప్రకటించారు.
ఇదీ చదవండి:పురోగతి లేని భారత్-చైనా అధికారుల చర్చలు