ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నారా భువనేశ్వరిని విమర్శించే హక్కు పుష్పశ్రీవాణికి లేదు' - మంత్రి పుష్ప శ్రీవాణిపై తెదేపా నేత అనిత

చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై పుష్ప శ్రీవాణి చేసిన ఆరోపణలను తెదేపా నేత అనిత ఖండించారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్​ గురించి మాట్లాడుతోన్న మంత్రికి దాని అర్థం తెలుసా అని ఎద్దేవా చేశారు.

tdp leader anitha on minister pushpa srivani
మంత్రి పుష్ప శ్రీవాణిపై తెదేపా నేత అనిత

By

Published : Jan 2, 2020, 12:55 PM IST

Updated : Jan 2, 2020, 2:50 PM IST

మంత్రి పుష్ప శ్రీవాణిపై తెదేపా నేత అనిత విమర్శలు

రాష్ట్ర మంత్రి పుష్ప శ్రీవాణికి నారా భువనేశ్వరిని విమర్శించే హక్కు లేదని తెలుగుదేశం నేత వంగలపూడి అనిత మండిపడ్డారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై పుష్ప శ్రీవాణి చేసిన ఆరోపణలను ఆమె ఖండించారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్​ గురించి మాట్లాడుతోన్న మంత్రికి దాని అర్థం తెలుసా అని ఎద్దేవా చేశారు. కంపెనీ విస్తరణ దృష్ట్యా ఏపీలో భూములు కొనాలని హెరిటేజ్‌ బోర్డు 2014 మార్చిలోనే నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఈ భూములు అసలు రాజధాని పరిధిలో లేవని తెలిపారు. తన వ్యాపారాల కోసం భూములు కొంటే ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఎలా అవుతుందని నిలదీశారు.

Last Updated : Jan 2, 2020, 2:50 PM IST

ABOUT THE AUTHOR

...view details