నంద్యాలలో పోలీసుల వేధింపులకు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన అబ్దుల్ సలాం ఘటనపై సీబీఐ దర్యాప్తునకు తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ నజీర్ డిమాండ్ చేశారు. సలాం కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా అధికార పార్టీ నేతలకు సమయం లేకుండాపోయిందని మండిపడ్డారు. మైనార్టీలపై ప్రభుత్వ కపట ప్రేమ ఈ వ్యవహారంతో స్పష్టమవుతోందని అన్నారు.
తమ అధినేత చంద్రబాబు డిమాండ్ చేసిన తర్వాతనే వైకాపా ప్రభుత్వం పరిహారం ప్రకటించిందని.. పరిహరాన్ని మసీదుకు ఇచ్చేస్తామని సలాం కుటుంబం చెప్పటం వారి నిబద్ధతకు నిదర్శనమన్నారు. స్థానిక పోలీసులే ఇందులో నిందితులని.. వారిపై సీబీఐ విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు.