అప్పన్న సేవలో స్వరూపానంద సరస్వతి - visakhapatnam
శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్నారు.
విశాఖపట్నం ప్రజల కొంగుబంగారంగా చెప్పుకునే శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామిని శారద పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి దర్శించుకున్నారు. ఆలయ సందర్శనానికి విచ్చేసిన స్వరూపానంద స్వామిని అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతించారు. అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, కప్ప స్తంభాన్ని స్వామి ఆలింగనం చేసుకున్నారు. స్వరూపానంద మాట్లాడుతూ సిజిఎఫ్ (కామన్ గుడ్ ఫండ్స్) నిధులు దుర్వినియోగం జరిగిని విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసకువెళ్తామని చెప్పారు. చాతుర్మాస్య దీక్షలో భాగంగా 80 రోజులు విశాఖ శారదా పీఠంలో భక్తులకు అందుబాటులో ఉండరని రిషికేష్ కు భక్తులు రావొద్దని విజ్ఞప్తి చేశారు.