పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అనకాపల్లి ట్రాఫిక్ సీఐ కిరణ్ కుమార్ అన్నారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు 'గ్రీన్ ఇండియా సేవ్ ఇండియా' పేరుతో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ ప్రదర్శన నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ చేపట్టకపోతే కలిగే అనర్థాలను వివరిస్తూ విద్యార్థులు ప్లకార్డులతో ప్రదర్శన జరిపారు. మొక్కలను చేతపట్టుకొని ప్రదర్శన నిర్వహించిన అనంతరం.. పాఠశాల ఆవరణలో వాటిని నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం అలవాటు చేసుకోవాలని సీఐ సూచించారు.
పర్యావరణ పరిరక్షణపై అనకాపల్లిలో ప్రదర్శన - save plants
విశాఖ జిల్లా అనకాపల్లిలో పర్యావరణ పరిరక్షణపై ఓ పాఠశాల విద్యార్థులు 'గ్రీన్ ఇండియా సేవ్ ఇండియా' పేరుతో ప్రదర్శన నిర్వహించారు.
ప్రదర్శన