విద్యార్థి అనుమానాస్పద మృతి - విద్యార్థి అనుమానాస్పద మృతి
విశాఖ జిల్లా ముంచంగిపుట్టులోని గిరిజన సంక్షేమ పాఠశాలలో ఓ విద్యార్థి అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు.
విశాఖ మన్యంలోని గిరిజన సంక్షేమ పాఠశాలలో ఓ విద్యార్థి అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. కుర్ర మోహన్ (13) ముంచంగిపుట్టు మండల కేంద్రంలోని బాలుర గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. గదిలో ఉరేసుకుని అనుమానాస్పద స్థితిలో ఉన్న మోహన్‌ను తోటి విద్యార్థులు గుర్తించారు. సిబ్బంది వెంటనే మోహన్‌ను ముంచంగిపుట్టు ఆసుపత్రికి తరలించగా... అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెప్పారు. ముంచంగిపుట్టు ఆస్పత్రి వద్ద విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేశారు.