రాష్ట్ర గురుకుల సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీకాంత్ ప్రభాకర్... విశాఖ జిల్లా పాడేరులో పర్యటించారు. స్థానిక గిరిజన గురుకుల కళాశాలలో పరిస్థితులపై ప్రిన్సిపల్ను అడిగి తెలుసుకున్నారు. ఏజెన్సీలో గురుకులాల స్థితిగతులపై వివరాలు సేకరించారు. స్థానికంగా ఉన్న ఉపాధ్యాయ సంఘం నేతలు, ఐకాస సభ్యులు... గురుకుల కార్యదర్శిని కలిశారు. గురుకులాల్లో పని చేస్తున్న అధ్యాపకులకు బకాయి జీతాలు చెల్లించాలని కోరారు. తాత్కాలిక ఉపాధ్యాయులను పర్మినెంట్ చేసి సమస్యలు తీర్చాలని విన్నవించారు.
పాడేరులో రాష్ట్ర గురుకుల సంక్షేమ శాఖ కార్యదర్శి పర్యటన
పాడేరులో రాష్ట్ర గురుకుల సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీకాంత్ ప్రభాకర్ పర్యటించారు. గిరిజన గురుకుల కళాశాల స్థితిగతులపై ఆరా తీశారు. అనంతరం ఉపాధ్యాయ సంఘం నేతలు, ఐకాస సభ్యులు... కార్యదర్శిని కలిశారు.
రాష్ట్ర గురుకుల కార్యదర్శి శ్రీకాంత్ ప్రభాకర్