జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన విశాఖ జిల్లా అనకాపల్లి బెల్లం మార్కెట్లో లావాదేవీలు నిలిచిపోయాయి. వ్యాపారులు, కొలగార్లకు మధ్య చర్చలు విఫలమైన కారణంగా.. సోమవారం బెల్లం మార్కెట్‌ను మూసివేశారు.
మార్కెట్లో బెల్లం కొనుగోలు చేసే వ్యాపారుల వద్ద కొలగార్లు పనిచేస్తుంటారు. ఒక వ్యాపారి వద్ద యార్డులో పనిచేసే కొలగారి.. మిగిలిన యార్డుల్లో వెళ్లకుండా పనిచేస్తున్నారు. ఈ సంప్రదాయాన్ని మార్చి.. యూనియన్ సభ్యులు ఒక దగ్గరే కాకుండా.. మార్కెట్లో ఏ వ్యాపారి వద్దనైనా పని చేయవచ్చునని, కొలగార్ల యూనియన్ సభ్యులు నిర్ణయించారు. ఈ ప్రతిపాదనకు వ్యాపారులు ఒప్పుకోవటం లేదు. సంవత్సరాలుగా ఉన్న సంప్రదాయాన్ని మార్చకూడదని వారు పట్టుపడుతున్నారు. కొలగార్లు, వ్యాపారు మధ్య సయోధ్య కుదరకపోవటంతో యార్డు మూతపడింది.