విశాఖ నగర పోలీస్ కమీషనర్ ఆర్కే మీనా ఆదేశాలతో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆధికారి అజిత వేజెండ్ల ఆధ్వర్యంలో ఇసుక అక్రమ రవాణాదారులపై అధికారులు కొరడా ఝుళిపించారు. ఈ నెల 12 నుంచి 25 వరకు నగర పరిధిలో ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి 16 కేసులు నమోదు చేసిన పోలీసులు 161.8 టన్నుల ఇసుకతో పాటు 17 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
21 మందిని అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు. ఎస్.ఈ.బి అధికారులు డిప్యూటీ కమిషనర్ టి. శ్రీనివాసరావు, అసిస్టెంట్ కమిషనర్ ఎం.భాస్కరరావు నగర పరిధిలో 128 అక్రమ మద్యం అమ్మకాలపై కేసులు నమోదు చేశారు. 131 మందిని అరెస్టు చేశారు. వీరి నుంచి 132.5 లీటర్లు మద్యం, 17.55 లీటర్ల బీర్లు, 6 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.