విశాఖ నుంచి చెన్నైకి అక్రమంగా తరలిస్తున్న గంజాయిని గుంటూరు జిల్లా మంగళగిరి దగ్గర పోలీసులు పట్టుకున్నారు. కారులో గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు... కాజా టోల్ గేట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. కారులో రూ.25 లక్షల నగదు, 420 కిలోల గంజాయితో పాటు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. గంజాయి తరలింపు వెనక ఎవరున్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత - undefined
అక్రమంగా తరలిస్తున్న 420 కిలోల గంజాయిని మంగళగిరి పోలీసులు పట్టుకున్నారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా కారులో గంజాయి గుర్తించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
విశాఖ నుంచి చెన్నైకి అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత
TAGGED:
ganjai