ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చీడికాడ - సిరిజాం రోడ్డుకు మరమ్మతులకు మోక్షమెప్పుడో!

అసలే గుంతలు పడ్డ రోడ్డుతో అవస్థలు పడుతుంటే.. మరో వైపు ఏకధాటిగా కురిసిన వర్షాలకు అవి కాస్తా చెరువులను తలపిస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు శిథిలమై దాదాపుగా ఆరేళ్లు కావస్తున్నా... అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Chidikada-Sirijam road
గుంతల రోడ్డు

By

Published : Oct 19, 2020, 3:16 PM IST

రోడ్డు దెబ్బ తిని పెద్ద పెద్ద గుంతలు పడి కొన్నేళ్లు గడుస్తున్నా పాలకులు మాత్రం పట్టించుకోవటం లేదు. చీడికాడ - సిరిజాం వెళ్లే దారి దెబ్బతిని ఆరేళ్లు గడుస్తున్నా పాలకులు పట్టించుకోవటం లేదు. ఈ రోడ్డుపై ఎక్కడ చూసినా గుంతలే తప్ప తారురోడ్డు స్వరూపం మాత్రం కనిపించలేదు. మరో వైపు భారీగా కురుస్తున్న వర్షాలకు అవి చెరువును తలపిస్తున్నాయి.

మరమ్మతులు చేయించమని ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు స్పందించటం లేదని ప్రజలు వాపోతున్నారు. పదుల సంఖ్యలో గ్రామాలకు ప్రధాన రోడ్డు కావటంతో ... నిత్యం వందల సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఫలితంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ రోడ్డు పరిస్థితి నేటికి పాలకులు, అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details