విశాఖలో ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన మహనీయుడు... వర్సిటీ తొలి ఉపకులపతి సర్ కట్టమంచి రామలింగారెడ్డి జయంతి సందర్భంగా... ప్రస్తుత ఉపకులపతి పీవీజీడీ. ప్రసాద్ రెడ్డి ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రపంచ యుద్ధం సందర్భంగా గుంటూరులోని అమరావతికి తరలిపోయింది. 5 సంవత్సరాలు అక్కడే ఉంది.
తిరిగి విశాఖకు రప్పించేందుకు కట్టమంచి రామలింగారెడ్డి కృషి చేశారని ఉపకులపతి గుర్తుచేశారు. ఇటీవల దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, ఐఐఎంలతో కలిపి 15 విద్యాలయాలకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్లెన్స్ హోదా వచ్చిందని... అందులో ఆంధ్ర వర్సిటీ ఉందన్నారు. వీటిలో 10 సంస్థలకు ప్రభుత్వం హోదా ఇచ్చిందని... ఏయూకి కూడా ఆ హోదా వచ్చినట్లయితే వెయ్యి కోట్ల మేర నిధులు సమకూరుతాయని ఉపకులపతి వివరించారు.