ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 22, 2021, 10:57 PM IST

ETV Bharat / state

విశాఖలో రెండో డోసు టీకా పంపిణీ

కొవిడ్ టీకా రెండో డోసు టీకా పంపిణీ ప్రక్రియ నగరంలో కొనసాగుతోంది. నాలుగు రోజుల పాటు టీకాలు వేసే ప్రత్యేక కార్యక్రమాన్ని నగర పాలక సంస్థ చేపట్టింది.

'విశాఖలో రెండో డోసు టీకా పంపిణీ.. ప్రజలు వినియోగించుకోవాలి'
'విశాఖలో రెండో డోసు టీకా పంపిణీ.. ప్రజలు వినియోగించుకోవాలి'

విశాఖపట్నం నగర పాలక సంస్ఖ పరిధిలో టీకాల రెండో డోసు ప్రక్రియ కొనసాగుతోంది. ఎంపిక చేసిన ఆరోగ్య కేంద్రాల్లోనూ టీకా వేస్తున్నారు. కొవాగ్జిన్, కోవిషీల్డ్ సంస్థల వ్యాక్సిన్​లు రెండో డోస్ మాత్రమే ఇస్తున్నారు. ఫోన్లకు సమాచారం అందినవారు లేదా వ్యాక్సినేషన్ చిట్టీలు పొందినవారు ఆయా స్లిప్స్ తో టీకా కేంద్రాలను సంప్రదిస్తే రెండో డోసు వ్యాక్సినేషన్ చేస్తున్నారు.

టీకా కేంద్రం వద్ద భౌతిక దూరం పాటించే నియామాలు...

వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత 30 నిమిషాలు పరిశీలనలో ఉంచేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో టీకా వేసుకోవడానికి వస్తున్నట్లు వైద్య అధికారులు పేర్కొన్నారు. రెండో డోస్ తీసుకునే వారు సుమారు 23 వేల మందికిపైగా ఉన్నారని అధికారులు అంచనా వేశారు. కొవాగ్జిన్ 28 రోజులు, కోవిషీల్డ్​కి 84 రోజులు గడువు ఉండాలని వివరించారు.

నగర వాసులు వినియోగించుకోవాలి..

విశాఖలో ఈ నాలుగు రోజులు టీకా పంపిణీ విస్తృతంగా జరుగుతుందని.. ప్రజలు వినియోగించుకోవాలన్నారు. కర్ఫ్యూ సమయంలో పోలీసులకు టీకా కోసం వచ్చిన మెసెజ్ లేదా స్లిప్ చూపించి టీకా కేంద్రలకు వచ్చే అనుమతి ఇచ్చినట్లు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి :ప్రశ్నిస్తే.. దాడులకు దిగుతున్నారు: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details