విశాఖ జిల్లా చీడికాడ మండలంలో ఆకాశంలో అద్భుత దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. బుధవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో తూర్పు భాగంలో ఇంద్ర ధనుస్సు ఏర్పడింది. పడమర భాగంలో అంబరం పసుపు వర్ణం కాంతులు వెదజల్లింది. సూర్యుడు అస్తమించినప్పుడు మేఘాలు ఆకర్షణీయంగా దర్శనమిచ్చాయి. ప్రజలు ఈ దృశ్యాలను ఎంతో ఆసక్తిగా తిలకించారు.
' పసుపు పచ్చని ఆకాశం' - ఇంద్ర ధనుస్సు
ప్రకృతి అందాలకు నెలవు. వాతవరణ పరిస్ధితులు బట్టీ ఆకాశం వివిధ రంగులతో కాంతులీనుతోంది. సాధారణంగా విదేశాల్లో కనిపించే ఈ అద్భుత దృశ్యాలు విశాఖలో దర్శనమిచ్చాయి.
పసుపు పచ్చని ఆకాశం
ఇదీ చూడండి: మూతపడ్డ రాజన్న క్యాంటీన్లు... ఆకలితో పేదలు