ఎడతెరిపిలేని వర్షాలకు విశాఖ మన్యంలో చిన్న చిన్న కాల్వలు, గడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. కించురు పంచాయతీలోని వనబంగి, తోటలగొంది, పుట్టమామిడి, వంటివిందుల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలకు పంటలు నీటమునిగాయి. జి. మాడుగుల మండలం కుంబిడిసింగి మత్యపురం రహదారిలో మత్యగెడ్డ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పాడేరు, హుకుంపేట మండలాల్లో వాన కురుస్తూనే ఉంది.
మన్యంలో ఎడతెరిపిలేని వర్షం... జలదిగ్బంధంలో గిరిజనులు - రాకపోకలు
ఆగకుండా కురుస్తున్న వర్షాలకు విశాఖ మన్యం పాడేరు అతలాకుతలమైంది. గిరిజనుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి, ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.
మన్యంలో ఎడతెరిపిలేని వర్షం.. జలదిగ్బంధంలో గిరిజనులు