నేడు సీఎం జగన్ విశాఖ పర్యటనలో భాగంగా పలువురు నేతలను ముందస్తుగా అరెస్టులు చేశారు. ఎంవీపీ కాలనీలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్, సీపీఎం నాయకులు ఆర్కేఎస్వీ కుమార్, పెందుర్తి సీఐటీయూ కార్యదర్శి జీ అప్పలరాజులను పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రంలో సరైన పరిపాల లేకపోవటంతోనే.. ఎక్కడా తిరగలేని పరిస్థితి నెలకొందని ప్రణవ్ గోపాల్ అన్నారు. తెదేపా నేతలు, కార్యకర్తలు బెదిరింపులకు భయపడరనీ.. ఉక్కు ఉద్యమాన్ని నీరు గార్చే విధంగా జగన్ ప్రయత్నం చేస్తున్నారని నేతలు ఆరోపించారు.
సీఎం జగన్ విశాఖ పర్యటన... పలువురు నేతలు ముందస్తు అరెస్టులు
సీఎం జగన్ విశాఖ పర్యటన నేపథ్యంలో.. పలువురు నేతలను పోలీసులు అరెస్టులు చేశారు. ముఖ్యమంత్రి పర్యటనలో నిరసన వ్యక్తం చేస్తారన్న అనుమానం ఉన్న నేతలను ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారు.
పలువురు నేతలు ముందస్తు అరెస్టులు