ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విశాఖలో ప్రజాసంఘాల ఆందోళన.. సోదాల పేరుతో వేధిస్తున్నారని ఆగ్రహం

By

Published : Apr 3, 2021, 1:40 PM IST

గడిచిన మూడు రోజులుగా జాతీయ దర్యాప్తు బృందాలు.. తమ ప్రతినిధులను, మద్దతునిచ్చే లాయర్లను సోదాల పేరుతో వేధిస్తున్నారని ప్రజా సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు విశాఖలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి జీవీఎంసీ గాంధీ బొమ్మ విగ్రహం వరకు ర్యాలీ చేశారు.

praja sangalu rally
విశాఖలో ప్రజాసంఘాలు ఆందోళన

విశాఖలో ప్రజాసంఘాల నేతలు అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి జీవీఎంసీ గాంధీ బొమ్మ విగ్రహం వరకు ర్యాలీ చేశారు. గడిచిన మూడు రోజులుగా జాతీయ దర్యాప్తు బృందాలు.. ప్రజా సంఘాల, ప్రతినిధులను, ప్రజా సంఘాలకు మద్దతునిచ్చే లాయర్లను, సోదాల పేరుతో వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధం లేనటువంటి కేసుల్లో ఇరికించి, వారి నుంచి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు తీసుకు పోతున్నారని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యంలో సమంజసం కాదని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రజాస్వామిక విధానంతో ముందుకు పోవడం ప్రజాస్వామ్యంలో చెల్లదంటూ.. నిరసన తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details