విశాఖ మన్యం జి.మాడుగుల మండలం మద్దిగరువులో మావోయిస్టు వ్యతిరేక పోస్టర్లు వెలిశాయి. మావోయిస్టులను నమ్మవద్దు... వారి చేతిలో ప్రాణాలు పోగొట్టుకోవద్దంటూ ఈ పోస్టర్లు అతికించారు. సానుభూతిపరులు, మిలీషియా సభ్యులకు విజ్ఞప్తి చేస్తూ... పోస్టర్లు వేశారు. "రంగారావు పరిస్థితి ఏమైంది.. మావోయిస్టులకు సహకరించి.. సభ్యుడిగా పని చేశాడు. వారి చేతిలో హతమయ్యాడు. రేపు మీ పరిస్థితి కూడా అంతే. పాముకి పాలు పోస్తే కాటు తప్పదు. మావోయిస్టులకు ఆశ్రయమిచ్చి సహాయం చేసినా... వారు చంపడం సహజం" అని పోస్టర్లలో పేర్కొన్నారు. పోలీసులకు మావోయిస్టలకు ఎప్పుడూ పడదు కాబట్టి... పోలీసులే ఈ పోస్టర్లను అతికించి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు.
మన్యంలో కలకలం... మావోయిస్టులను నమ్మొద్దంటూ పోస్టర్ - విశాఖ మన్యం తాజా వార్తలు
విశాఖ మన్యంలో పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. మిలీషియా సభ్యులకు, సానుభూతిపరులకు మావోయిస్టులను నమ్మకండంటూ విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆ పోస్టర్లలో పేర్కొన్నారు. పోలీసులే ఇలా చేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు.
మావోయిస్టులను నమ్మోద్దంటూ పోస్టర్ మన్యంలో పోస్టర్ కలకలం