సేవా భారత్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న 'కౌశలం' నైపుణ్యాభివృద్ధి కేంద్రానికి... కేంద్ర మాజీమంత్రి సురేష్ ప్రభు శంకుస్థాపన చేశారు. గుంటూరు సంపత్ నగర్లోని సేవాభారతి ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... దేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకమైందన్నారు. యువతను అభివృద్ధి పథంలో నడిపించేందుకు నైపుణ్యాభివృద్ధి సంస్థలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. గుంటూరులో ఈ తరహా కేంద్రానికి శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తుండడం గర్వంగా ఉందని చెప్పారు. 13 జిల్లాల్లో వైద్య సేవలు అందించేలా ఎంపీ నిధులతో ఉచిత అంబులెన్స్ సౌకర్యం కల్పించామని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని యువతలో నైపుణ్యాభివృద్ధి పెంపొందించేలా శిక్షణా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు.
ఇదీ చదవండి : రహదారిపై రైతుల బైఠాయింపు.. వంటావార్పు