విశాఖ గాజువాక ఆటోనగర్‌లో నాలుగేళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. అయితే ఈకేసును పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. ఆటోనగర్‌లో శనివారం రాత్రి ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలుడిని కొందరు వ్యక్తులు అపహరించారు. రాజస్తాన్‌కు చెందిన నరేష్ యాదవ్ విశాఖకు వలస వచ్చి పరిశ్రమ నడుపుతున్నారు. రూ.43 లక్షల అప్పు వ్యవహారమే అపహరణకు దారితీసిందని పోలీసులు భావిస్తున్నారు.
విశాఖలో బాలుడి అపహరణ...గంటల వ్యవధిలో కేసును ఛేదించిన పోలీసులు - బాలుడి కిడ్నాప్ వార్తలు

విశాఖలో బాలుడి అపహరణ కేసును ఛేదించిన పోలీసులు
12:06 November 01
బాలుడి తండ్రి నరేష్ స్థానిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు..ఫోన్ నెట్వర్క్ ద్వారా లొకేషన్‌ను గుర్తించి... రెండు గంటల్లోనే కేసును ఛేదించారు. వన్ టౌన్ ఏరియాలోని ఓ ఇంటిలో బాలుడిని ఉంచినట్లు కనుగొన్న పోలీసులు... దుండుగుల నుంచి సురక్షితంగా కాపాడారు. కిడ్నాప్ చేసిన 5గురు నిందితులను అరెస్టు చేశారు.
ఇదీ చదవండి:
Last Updated : Nov 1, 2020, 2:12 PM IST