విశాఖ జిల్లా కోటఉరట్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన 4.59 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాలుగా ఇచ్చేందుకు.. అధికారులు చేస్తున్న ప్రయత్నాన్ని నిలువరించాలని కోరుతూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. విశ్రాంత బ్యాంక్ మేనేజరు పి.వెంకట సూర్యరావు ఈ పిటిషన్ వేశారు. సర్వే నెంబరు 347లోని కళాశాలకు చెందిన 4.59 ఎకరాల భూమిలో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు హద్దులు ఏర్పాటు చేశారన్నారు. గ్రామకంఠానికి చెందిన ఆ భూమిని 1977లో కళాశాలకు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిందన్నారు. అప్పటి నుంచి ఆ భూమి కళాశాల స్వాధీనంలో ఉందని... ఇప్పుడు దాన్ని ఇళ్లస్థలాలుగా ఎలా ఇస్తారన్నారు. కనీసం నోటీసులు సైతం ఇవ్వకుండా ఏకపక్షంగా హద్దులు నిర్ణయించారని పిటిషన్లో పేర్కొన్నారు. రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, విశాఖ కలెక్టర్, ఆర్డీవో, కోటఉరట్ల తహసీల్దార్లను ప్రతివాదులుగా చేర్చారు.
ఇళ్ల స్థలాలుగా కళాశాల భూమి.. నిలువరించాలంటూ హైకోర్టులో వ్యాజ్యం - విశాఖ జిల్లాలో ఇళ్ల స్థలాలుగా కళాశాల భూమి
విశాఖ జిల్లా కోటఉరట్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన 4.59 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాలుగా ఇచ్చేందుకు.. అధికారులు చేస్తున్న యత్నాన్ని నిలువరించాలని కోరుతూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఏకపక్షంగా హద్దులు నిర్ణయించారని పిటిషన్లో పేర్కొన్నారు.
![ఇళ్ల స్థలాలుగా కళాశాల భూమి.. నిలువరించాలంటూ హైకోర్టులో వ్యాజ్యం pill in highcourt on college land select house lands in vizag](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6314925-572-6314925-1583484212758.jpg)
హైకోర్టు