విశాఖ మన్యంలో మరోసారి మావోయిస్టుల అలజడి గుబులురేపుతోంది. కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దును తప్పుపడుతూ వెలసిన బ్యానర్లతో భద్రతా దళాలు అప్రమత్తం అయ్యాయి. పాడేరు, జి.మాడుగుల, మద్దిగరువు ప్రాంతాల్లో ఈ బ్యానర్లు వెలిశాయి. దీంతో ఈ ప్రాంతంలో మావోయిస్టు యాక్షన్ టీంలు సంచరిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు గస్తీ కట్టుదిట్టం చేశారు. దీనికి తోడు ఈ నెల 13 నుంచి 23 వరకు పదిరోజుల పాటు విశాఖ వేదికగా జాతీయ ఆదివాసి దినోత్సవం జరుగనుంది. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల నుంచి కళాకారులు, ప్రముఖులు హజరవుతున్నారు. ఈ నేపథ్యంలో మాడుగుల మార్కెట్లో మావోల బ్యానర్లు నిఘావర్గాల్లో ఆందోళన సృష్టించాయి. పాడేరు, జి.మాడుగుల, మద్దిగరువు తో పాటు మన్యంలోని ఇతర ప్రాంతాల్లో అణువణువు గాలిస్తున్నారు. మావోయిస్టుల గురించి ఎటువంటి సమాచారం ఉన్నా పోలీసులకు తెలియజేయాలని సంతలో ఉన్న దుకాణ, వాహన యజమానులకు పోలీసులు సూచించారు. అటు భద్రతాదళాల కూంబింగ్, ఇటు మావోయిస్టుల బ్యానర్లతో స్థానిక ప్రజలు భయంతో వణికిపోతున్నారు.
విశాఖ మన్యంలో ఆర్టికల్ 370 అలజడి - maoist banners at g.madugula market
కాశ్మీర్ 370 ఆర్టికల్ రద్దును నిరసిస్తూ విశాఖ మన్యంలో వెలసిన బ్యానర్లతో, మావోయిస్టుల కదలికలపై నిఘావర్గాలు అప్రమత్తం అయ్యాయి. విశాఖలో జాతీయ ఆదివాసి ఉత్సవాలు నేపథ్యంలో మాడుగుల మార్కెట్లో మావోల బ్యానర్లు కలకలం రేపాయి.
విశాఖలో మావోల బ్యానర్ల కలకలం