లాక్ డౌన్ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా అంబులెన్స్‌లో ప్రయాణికులను తరిలించినందుకు అంబులెన్స్ డ్రైవర్ ఉద్యోగం కోల్పోయాడు. ఈ ఘటన విశాఖ మన్యం ముంచింగిపుట్టులో జరిగింది. ముంచింగిపుట్టు నుంచి నలుగురు ప్రయాణికులను డ్రైవర్ రవికుమార్ అంబులెన్స్‌లో పాడేరుకు తీసుకెళ్లాడు. విషయం తెలుసుకున్న పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డీకే బాలాజీ అతడిని విధుల నుంచి తప్పించారు. ఆ నలుగురు వ్యక్తుల్ని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. అత్యవసర వాహనంలో ప్రయాణికుల్ని తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అంబులెన్సులో ప్రయాణికులు.. ఉద్యోగం పోగోట్టుకున్న డ్రైవర్ - passengers in ambulance driver lost his job at munchungipattu paderu manyam
అంబులెన్సులో సాధారణ ప్రయాణికుల్ని తరలించినందుకు ఉద్యోగం కోల్పోయాడు డ్రైవర్. నిబంధనలు అతిక్రమించి వారిని తరలించినందుకు మూల్యం చెల్లించుకున్నాడు.
అంబులెన్సులో ప్రయాణికులు