ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'విశాఖను రాజధాని చేయాలని 14 ఏళ్లుగా పోరాడుతున్నా' - టీజీ వెంకటేశ్ తాజా న్యూస్

పరిపాలనపై కేంద్ర ప్రభుత్వానికి సూచనలు ఇచ్చే శక్తిలా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పనిచేస్తుందని పార్లమెంటరీ స్థాయి సంఘం ఛైర్మన్ టీజీ వెంకటేశ్ అన్నారు. విశాఖను రాజధాని చేయాలని 14 ఏళ్లుగా పోరాటం చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

parlamentary committee meeting in visakhapatnam
విశాఖలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం

By

Published : Jan 8, 2020, 6:29 AM IST

పరిపాలనపై కేంద్ర ప్రభుత్వానికి సూచనలు ఇచ్చే శక్తిలా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పనిచేస్తుందని పార్లమెంటరీ స్థాయి సంఘం ఛైర్మన్ టీజీ వెంకటేశ్ అన్నారు. విశాఖలో నిర్వహించిన సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ రాష్ట్రంలో లేని వనరులు ఏపీలో ఉన్నాయని టీజీ వ్యాఖ్యానించారు. విశాఖలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తెలంగాణలో హైదరాబాద్ తప్ప మరే ఇతర నగరం ఎక్కువగా అభివృద్ధి చెందలేదన్న ఆయన... ఏపీలో ఎక్కువ సంఖ్యలో నగరాలు అభివృద్ధి చెందాయన్నారు. విశాఖను రాజధాని చేయాలని 14 ఏళ్లుగా పోరాటం చేస్తున్నట్లు తెలిపారు.

విశాఖలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం

ABOUT THE AUTHOR

...view details