'3 రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకించటం సరికాదు' - latest news of 3 capital issue
మూడు రాజధానుల ప్రతిపాదనను పార్లమెంట్ సభ్యులు టీజీ వెంకటేష్ సమర్థించారు. రాయలసీమను ఇప్పటివరకు అభివృద్ధి చేసిన నాయకుడు లేరని ... ఇప్పటికైన సీమ ప్రాంత ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడిన ఆయన.. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తే.. కేంద్ర రాష్ట్రాలకు వారధిగా అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. కర్నూలు, విశాఖలో వరదలు వస్తాయంటూ... రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకించటం సరికాదన్నారు.